SLBC Tunnel Collapse News | నాగర్ కర్నూల్ జిల్లా ధోమలపెంట సమీపంలోని ఎస్ఎల్బీసీ టన్నెల్ లో జరిగిన ప్రమాదంలో ఎనమిది మంది చిక్కుకున్న విషయం తెల్సిందే.
ఈ దుర్ఘటనలో ఇద్దరు ఇంజనీర్లు, ఇద్దరు ఆపరేటర్లు, నలుగురు కార్మికులు టన్నెల్ లో చిక్కుకున్నారు. వారిని రెస్క్యూ చేసేందుకు ఆపరేషన్ కొనసాగుతుంది. వారిని కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఆర్మి, రీజినల్, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్లు రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్నారు.
మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు దగ్గరుండి సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు. సైనిక బృందలాతో పాటు మంత్రి జూపల్లి కూడా టన్నెల్ లోనికి వెళ్లారు.
సొరంగ మార్గంలో 13.5 కి.మీ. లోపలికి వెళ్లగా మరో అర కి.మీ. వెళ్ళాల్సివుండగా కూలిన మట్టి, నీరుతో వారికి ఆటంకం ఎదురైంది. ప్రస్తుతం వాటిని తొలగించే పనిలో సహాయక బృందాలు ఉన్నాయి.