Siddipet Qnet Scam Incident | మోసపూరిత QNet సంస్థ వలలో చిక్కుకుని సిద్ధిపేట జిల్లా వర్గల్ మండలం వేలూరు గ్రామానికి చెందిన యువకుడు హరికృష్ణ బలవన్మరణానికి పాల్పడ్డాడు. QNet వంటి గొలుసుకట్టు సంస్థలు యువతను అధిక లాభాలు పేరుతో ఆర్థికంగా నాశనం చేసి, కుటుంబాలను చిద్రం చేస్తున్నాయి.
ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు సిద్దిపేట సీపీ విజయ్ కుమార్. క్యూ నెట్ వంటి వాటిలో పెట్టుబడులు పెట్టి మోసపోవద్దని మోసపోయి ప్రాణాలు కోల్పోవద్దని తెలిపారు. అమాయకులను ఇలాంటి వాటిలో చేర్పించి డబ్బులు దండుకుంటున్న వారిని త్వరలోనే పట్టుకుంటామని ఆయన చెప్పారు. మనీ సర్క్యూలేషన్ స్కీం అనేది మోసం అని ఎలాంటి ప్రొడక్టవిటీ ఉండదని తెలిపారు.
ఇలాంటి స్కీంలపై 1978లోనే నిషేధం విధిస్తూ చట్టం అమల్లోకి వచ్చిందని గుర్తు చేశారు. క్యూ నెట్ ను సింగపూర్ నుంచి ఆపరేట్ చేస్తున్నారని, దీనిని ఎవరూ ప్రమోట్ చేయొద్దని సీపీ పేర్కొన్నారు.









