Saturday 31st January 2026
12:07:03 PM
Home > తాజా > ‘డ్రగ్స్ రైడ్..హోటల్ నుండి పారిపోయిన దసరా విలన్’

‘డ్రగ్స్ రైడ్..హోటల్ నుండి పారిపోయిన దసరా విలన్’

Shine Tom Chacko Drug Case | ‘దసరా’ సినిమాలో విలన్ పాత్ర పోషించి మంచి ఆదరణ పొందిన మలయాళ నటుడు షైన్ టామ్ చాకో మరోసారి వార్తల్లో నిలిచాడు.

నటుడు డ్రగ్స్ తీసుకొని తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని నటి విన్సీ సోని ఫిర్యాదు చేసిన విషయం తెల్సిందే. ఇదే సమయంలో పోలీసుల డ్రగ్స్ రైడ్ నుండి తప్పించుకునేందుకు షైన్ టామ్ హోటల్ నుండి పారిపోయినట్లు కథనాలు రావడం కలకలం రేపుతోంది.

నటి విన్సీ సోని ఫిర్యాదు చేసిన సమయంలోనే కేరళ కొచ్చిలోని ఓ హోటల్ లో డ్రగ్స్ వినియోగిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో నార్కోటిక్ పోలీసులు హోటల్ వద్దకు చేరుకున్నారు. అయితే, పోలీసులు రావడానికంటే ముందే నటుడు హోటల్ నుండి పారిపోయినట్లు సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చింది.

హోటల్ లోని మూడవ అంతస్తు లో ఉన్న నటుడు కిటికీ నుండి రెండవ అంతస్తులోకి దూకి అక్కడి నుండి మెట్ల మార్గాన బయటకు పారిపోయాడని తెలుస్తోంది. బుధవారం ఉదయం 11 గంటలకు ఈ ఘటన జరిగినట్లు సమాచారం. దీనికి సంబంధించిన విషయాలను కేరళ పోలీసులు వెల్లడించాల్సి ఉంది. ఇదిలా ఉండగా మూవీ సెట్ లోనే డ్రగ్స్ తీసుకుని తనతో అసభ్యంగా ప్రవర్తించాడని నటి విన్సీ సోని ఆరోపణలు చేయడం మలయాళ ఇండస్ట్రీని కుదిపేస్తోంది.

You may also like
‘లేడికి-లేడి గెటప్ కు తేడా తెలీదా’..జగన్ కు కమెడియన్ కౌంటర్
పాడి కౌశిక్ పై ఎంఐఎం, ఐపీఎస్ సంఘం తీవ్ర ఆగ్రహం
ఖమ్మం మంత్రిపై వైఎస్ జగన్ కు ఫిర్యాదు
social media code for govt servants
వారు సోషల్ మీడియా వాడాలంటే అనుమతి తప్పనిసరి.. ఎక్కడంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions