Shibu Soren Dies At 81 | కేంద్ర మాజీ మంత్రి, ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబూసోరెన్ 81 ఏళ్ల వయస్సులో కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ సమస్యలతో బాధపతున్న ఆయన ఢిల్లీలోని గంగారాం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
ఈ నేపథ్యంలో రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. దేశ అగ్ర రాజకీయ నాయకుల్లో శిబూసోరెన్ ఒకరు. బీహార్ రాష్ట్రం నుంచి ఝార్ఖండ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు కావడంలో శిబూసోరెన్ ఎనలేని పోరాటం చేశారు.
ఝార్ఖండ్ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఆయన ‘ఝార్ఖండ్ ముక్తీ మోర్చా’ పార్టీని స్థాపించారు. రాష్ట్రం ఏర్పడిన అనంతరం శిబూసోరెన్ మూడు సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అలాగే 2004 నుంచి 2006 మధ్య కేంద్రమంత్రిగా సేవలందించారు.
మరణించే ముందు వరకు ఆయన రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. శిబూసోరెన్ కుమారుడు హేమంత్ సోరెన్ ప్రస్తుతం ఝార్ఖండ్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు.









