Shashi Tharoor On Working Hours | యర్నేస్ట్ అండ్ యంగ్ ఇండియా సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ( Ernst And Young India ) లో పనిచేస్తున్న కోచికి చెందిన అన్నా సెబాస్టియన్ ( Anna Sebastian ) పని ఒత్తిడి కారణంగా మరణించిన విషయం తెల్సిందే.
చార్టెడ్ అకౌంటెంట్ గా పనిచేస్తున్న 26 ఏళ్ల సెబాస్టియన్ గత నాలుగు నెలలుగా రోజుకు 14 గంటల పాటు తీవ్ర ఒత్తిడి మధ్య పనిచేశారు. ఈ క్రమంలో జులై 20న పనిచేస్తూ ఒక్కసారిగా కుప్పకులారు.
ఈ నేపథ్యంలో పని గంటలపై మరోసారి దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. ఈ క్రమంలో కాంగ్రెస్ నాయకులు, ఎంపీ శశిథరూర్ ( Shashi Tharoor ) స్పందించారు.
ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీల్లో రోజుకు 8 గంటలు, వారానికి ఐదు రోజులు మించి ఉద్యోగులతో పని చేయించకూడదని పేర్కొన్నారు. ఈ మేరకు ఫిక్స్ద్ క్యాలెండర్ ఉండాలని సూచించారు.
కంపెనీలు అమానవీయ చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు, జరిమానా విధించే విధంగా చట్టం తీసుకురావాలని అభిప్రాయపడ్డారు. మానవహక్కులను అడ్డుకోకూడదన్నారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రస్తావించనున్నట్లు శశిథరూర్ చెప్పారు.