Seethakka Sworn As Minister| తెలంగాణ ( Telangana )లో సీఎం రేవంత్ రెడ్డి ( Revanth Reddy )తో కొలువుదీరిన కొత్త ప్రభుత్వంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క ( Seethakka ) అలియాస్ ధనసరి అనసూయ ( Dhanasari Anasuya )కు చోటు దక్కింది. గురువారం సీఎం రేవంత్ రెడ్డి, సహచరులతోపాటు సీతక్క కూడా ప్రమాణ స్వీకారం చేశారు.
ఒకనాడు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వామపక్ష భావజాలంతో అడవులలో తుపాకి పట్టిన సీతక్క, నేడు ధనసరి అనసూయగా మంత్రి ( Minister) హోదాలో ప్రమాణ స్వీకారం చేశారు.
సుమారు రెండు దశాబ్దాల పాటు నక్సల్ ( Naxal ) ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించిన సీతక్క, నందమూరి తారాక రామారావు ( Nandamuri Taraka Ramarao ) పిలుపు మేరకు జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. అనంతరం టీడీపీ ( TDP ) ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.
ములుగు ( Mulugu ) నియోజకవర్గం నుండి 2004 లో పోటీ చేసిన సీతక్క కాంగ్రెస్ ( Congress ) అభ్యర్ధి చేతిలో ఓడిపోయారు. అనంతరం 2009, 2018, 2023 లో ములుగు ఎమ్మెల్యేగా గెలుపొందారు ఆమె. అయితే సీతక్క, సీఎం రేవంత్ రెడ్డి ల మధ్య ఉన్న అన్నాచెల్లెల అనుభంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఆనాడు టిడిపి లో ఉన్నా, నేడు కాంగ్రెస్ లో ఉన్న ప్రతి రాఖీపౌర్ణమికి ఇంటికి వెళ్ళి మరీ రేవంత్ కు రాఖీ కడుతారు సీతక్క. తాజాగా రేవంత్ రెడ్డి సిఎం గా ప్రమాణ స్వీకారం చేయగా, మంత్రి హోదాలో సీతక్క ప్రమాణ స్వీకారం చేశారు.
గతంలో వైఎస్ ( Ys Rajashekar Reddy ) ప్రభుత్వంలో చేవెళ్ల చెల్లమ్మ గా సబితా ఇంద్రారెడ్డి ( Sabita Indrareddy ) హోం మంత్రిగా విశేష సేవలు అంధించారు. మరి ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ చెల్లెమ్మగా సీతక్క ఎటువంటి పాత్రను పోషిస్తారో వేచి చూడాలి.