Sarpanch names grandson K Chandrashekhar Rao | ఓ బీఆరెస్ ( BRS ) నేత కేసీఆర్ పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు.
ఆదిలాబాద్ జిల్లా ముఖ్రా కె ( Mukhra-K ) గ్రామ మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి సుభాష్ బీఆరెస్ అధినేత కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని తన మనువడికి కేసీఆర్ గా నామకరణం చేశారు.
ముఖ్రా కె గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశంలోనే ఆదర్శ గ్రామంగా కేసీఆర్ తీర్చిదిద్దారని పేర్కొన్నారు. కేసీఆర్‌తోనే తమ గ్రామం దేశంలోనే అభివృద్ధిలో నంబర్ వన్‌గా నిలిచిందని చెప్పారు.
కేసీఆర్ ప్రవేశపెట్టిన పల్లె ప్రగతితోనే తమ గ్రామానికి జాతీయ స్థాయిలో 5 అవార్డులు వచ్చాయని తెలిపారు. గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన కేసీఆర్ రుణం తీర్చుకోలేనిదని చెప్పారు. అందుకే తన పిల్లలు గాడ్గే వైష్ణవి-ధీరజ్‌కి జన్మించిన కొడుకుకు కేసీఆర్‌గా నామకరణం చేశామన్నారు.