Samson returns to Kerala cricket with record KCL signing | ఐపీఎల్ లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ తరఫున కెప్టెన్ గా వ్యవహరిస్తున్న సంజూ శాంసన్ మరోసారి చరిత్ర సృష్టించారు.
ఈ ఆటగాడి కోసం ఓ ఫ్రాంచైజీ పర్స్ లోని సగం కంటే ఎక్కువ మొత్తాన్ని చెల్లించింది. కేరళ క్రికెట్ లీగ్ రెండవ ఎడిషన్ కు సంబంధించిన ఆక్షన్ తాజగా జరిగింది. ఇందుకోసం ఒక్కో ఫ్రాంచైజీకి రూ.50 లక్షల పర్స్ ను కేటాయించారు.
ఆక్షన్ లో భాగంగా సంజూ శంసన్ ను దక్కించుకునేందుకు ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. ఎట్టకేలకు రూ.26.80 లక్షలకు సంజూను కొచ్చి బ్లూ టైగర్ జట్టు దక్కించుకుంది. రూ.3 లక్షల బేస్ ప్రైజ్ తో ఆక్షన్ లోకి వచ్చిన సంజూను తన పర్స్ వాల్యూలో సగం కంటే ఎక్కువ పెట్టి జట్టు కొనుగోలు చేసింది.
దింతో కేరళ క్రికెట్ లీగ్ లో అత్యధిక ధర పలికిన ప్లేయర్ గా సంజూ చరిత్ర సృష్టించాడు. ఇదిలా ఉండగా రాబోయే ఐపీఎల్ సీజన్ లో సంజూ శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతారని జోరుగా ప్రచారం జరుగుతుంది. చెన్నై టీంకు సంజూ కెప్టెన్ గా వ్యవహరించే అవకాశం ఉన్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.