Monday 16th March 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > పవన్ కళ్యాణ్ గారు అధికారం కోసం అబద్ధాలు చెబుతారా

పవన్ కళ్యాణ్ గారు అధికారం కోసం అబద్ధాలు చెబుతారా

Roja News Latest | అధికార టీడీపీ ( TDP ), జనసేన పార్టీ ( Janasena Party ) పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు రోజా.

వైసీపీ ప్రభుత్వం లో వాలంటీర్ల ద్వారా మహిళల అక్రమ రవాణా జరిగిందని, 30 వేల మంది మహిళలు మిస్ ( Missing ) అయ్యారని చేసిన ఆరోపణలన్నీ పచ్చి అబద్ధమని రోజా తెలిపారు.

ఐదేళ్ళలో 34 కేసులు మహిళల అక్రమ రవాణాకు సంబంధించి నమోదయ్యాయి అని సాక్షాత్తు హోంమంత్రి అనితనే అసెంబ్లీ లో ప్రశ్నకి సమాధానం లిఖిత పూర్వకంగా ఇచ్చిన పత్రాన్ని పోస్ట్ చేశారు.

గతంలోనే మిస్సింగ్ కేసులలో 99.5 శాతంకి పైగా మహిళలను గుర్తించారని కేంద్ర హోంశాఖ కూడా పార్లమెంట్ లో స్పష్టం చేసిందని తెలిపారు. ‘ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోండి పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) అధికారం కోసం ఎంతటి అబద్ధమైన చెప్తారా..?’ అని రోజా నిలదీశారు.

అసెంబ్లీ సాక్షిగా ఇన్నాళ్లు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ చేసిన తప్పుడు ప్రచారం బట్టబయలైందని రోజా స్పష్టం చేశారు.

You may also like
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
gaddar awards
గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్తమ చిత్రం ఏదంటే!
kalvakuntla kavitha
‘ఎస్సీల రిజర్వేషన్లు 18 శాతానికి పెంచాలి’
రాష్ట్రంలో కాంగ్రెస్ బుల్డోజర్ రాజ్యం

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions