Roja Fires On Govt. | కూటమి ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు మాజీ మంత్రి, వైసీపీ నాయకులు రోజా.
అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా “ఇది మంచి ప్రభుత్వం” అని చెప్పేందుకు స్టిక్కర్లు, కరపత్రాలు పంచడానికి ప్రభుత్వం రూ.5.67 కోట్లు మంజూరు చేసిందని విమర్శలు గుప్పించారు రోజా.
20-09-2024 నుండి 26-09-2024 వరకు “ఇది మంచి ప్రభుత్వం” కార్యక్రమం నిర్వహణ కోసం ముద్రణ ఖర్చులకే రూ.5,67,00,000 మంజూరు చేశారని గ్రామ వార్డు సచివాలయ శాఖ జారీ చేసిన ఉత్తర్వుల ఫోటోను షేర్ చేశారు.
ఇది అభివృద్ధి కోసం చేసిన ఖర్చు కాదు, ప్రజల సమస్యలు పరిష్కరించాడానికి చేసిన ఖర్చు కాదని ఇది కేవలం ప్రచార ఖర్చు మాత్రమేనని రోజా మండిపడ్డారు. ‘ అయ్యా చంద్రబాబు.. ఇది మంచి ప్రభుత్వం కాదు, ముంచే ప్రభుత్వం’ అని తెలిపారు. ప్రజల సొమ్మును ఇలా వృధా ఖర్చులతో గాల్లో కలిపేస్తారా అని ప్రభుత్వాన్ని రోజా ప్రశ్నించారు.