Rohit Sharma News | టీం ఇండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు వడాపాప్ అంటే చాలా ఇష్టం. ప్రస్తుతం ఫిట్నెస్ పై దృష్టి పెట్టిన రోహిత్ వీటికి దూరంగా ఉంటున్నారు. ఇదే సమయంలో ఓ అభిమాని సరదాగా రోహిత్ ను ఆటపట్టించాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. విజయ హజారే ట్రోఫీలో భాగంగా ముంబయి తరఫున రోహిత్ శర్మ బరిలోకి దిగారు. బుధవారం జైపూర్ వేదికగా సిక్కింతో జరిగిన మ్యాచులో హిట్ మ్యాన్ అద్భుత ప్రదర్శన కనబరిచారు.
94 బంతుల్లో 155 పరుగులు చేసి జట్టును గెలిపించి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ గా నిలిచారు. అయితే రోహిత్ ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో అభిమానులు రోహిత్ ను ఆటపట్టించారు. ‘రోహిత్ భాయ్ వడాపావ్ తింటావా’ అని గట్టిగా కేకేశారు. దీనిపై అంతే సరదాగా రోహిత్ కూడా స్పందించారు. వద్దు అంటూ చేతితో సంజ్ఞ చేశారు. దింతో అభిమానులు సంబరపడ్డారు. కాగా ఇటీవలే ఫిట్నెస్ పై దృష్టి సారించిన రోహిత్ 10 కేజీలకు పైగా బరువు తగ్గారు.









