Rohit Sharma About His Retirement Rumors | సిడ్నీ ( Sydney ) వేదికగా ఆస్ట్రేలియా-భారత్ మధ్య ఐదవ టెస్టు మ్యాచ్ కొనసాగుతున్న విషయం తెల్సిందే.
అయితే ఈ మ్యాచుకు కెప్టెన్ రోహిత్ శర్మ ( Rohit Sharma ) దూరంగా ఉండడం కలకలం రేపింది. దింతో రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటిస్తారని జోరుగా ప్రచారం జరిగింది. దింతో ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు.
ఎట్టకేలకు రోహిత్ శర్మ తన రిటైర్మెంట్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను రిటైర్మెంట్ తీసుకోవడం లేదని, కేవలం సిడ్నీ టెస్టు నుంచి మాత్రమే రెస్ట్ ( Rest ) తీసుకున్నట్లు స్పష్టం చేశారు. తాను ఇప్పుడు రన్స్ చేయలేకపోయినట్లు, కానీ తిరిగి ఫార్మ్ లోకి రావడానికి నిరంతరం శ్రమిస్తానని పేర్కొన్నారు.
తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని, ఏ సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలుసన్నారు. తనకు టీం ప్రయోజనాలే ముఖ్యమని, ఆ తర్వాతే వ్యక్తిగత ప్రయోజనమన్నారు. కీలకమైన సిడ్నీ టెస్టులో ఫార్మ్ తో ఇబ్బంది పడుతున్న ప్లేయర్లు వద్దనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.