Road Accident: Humanity Is Forgotten | రక్తపుమడుగులో ఉన్న ఓ వ్యక్తి తనను కాపాడాలని వేడుకున్నా మనుషులు చలించలేదు. ఆఖరికి ఆయన ప్రాణం పోయింది.
మానవత్వానికే ఈ ఘటన ఓ మచ్చలా మిగిలిపోయింది. వివరాల్లోకి వెళ్తే వరంగల్ కు చెందిన ఎలేందర్ హైదరాబాద్ లోని కీసర వద్ద రాంపల్లి చౌరస్తాలో నివసిస్తున్నారు. కొత్తగా కడుతున్న ఇల్లును చూసి వచ్చేందుకు స్కూటీపై బయలుదేరారు.
ఈ క్రమంలో వెనుక నుండి వచ్చిన లారీ ఎలెందర్ ను ఢీ కొట్టింది. దింతో స్థానికులు కేకలు వేశారు. వెంటనే లారీ డ్రైవర్ ఒక్కసారిగా రివర్స్ చేయడంతో ఎలెందర్ కాళ్ళు నుజ్జునుజ్జయ్యాయి.
తీవ్ర రక్తస్రావంతో విలవిలలాడుతూ తనను ఆసుపత్రికి తీసుకెళ్లాలని వేడుకున్నాడు. కానీ అక్కడి వారు ఫోటోలు, వీడియోలు తీస్తూ గడిపేశారు. కొద్దిసేపటికి అంబులెన్సు వచ్చి ఆసుపత్రికి తరలించింది. అలస్యం కావడంతో సదరు వ్యక్తి మరణించారు.
హాస్పిటల్ కు తరలించడని వేడుకున్నా పోగైన జనం చోద్యం చూశారే తప్ప సహాయం చేయలేదు.