Friday 30th January 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ఏపీ ఎన్నికలు సునామీలా వచ్చి వెళ్లాయి

ఏపీ ఎన్నికలు సునామీలా వచ్చి వెళ్లాయి

RK Roja Latest News | ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల అనంతరం నుండి స్థబ్దుగా ఉన్న మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు రోజా ( Rk Roja ) తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు.

నగరి ( Nagari )నియోజకవర్గం పుత్తూరులో నూతనంగా నిర్మించిన బలిజ భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రోజా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె ఏపీ ఎన్నికలు సునామిలా వచ్చి వెళ్లాయన్నారు.

ఇది ముమ్మాటికీ ప్రజలు ఇచ్చిన ఓటమి కాదని, కచ్చితంగా ఏమి జరిగిందో ఏదొక రోజు బయటకు వస్తుందని తెలిపారు. ఇంత ఘోరంగా ఓడిపోయేంత తప్పులు వైసీపీ ఏమి చేయలేదని పేర్కొన్నారు.

ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నప్పుడు ఎలా అందుబాటులో ఉన్నామో ఇప్పుడు కూడా అలానే అందుబాటులో ఉంటానని రోజా భరోసా ఇచ్చారు. ప్రతీ కార్యకర్తకు అండగా ఉండనున్నట్లు హామీ ఇచ్చారు.

ఇదిలా ఉండగా ఎన్నికల ఫలితాల తర్వాత రోజా చెన్నై ( Chennai ) లో అధికంగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఆమె వైసీపీని వీడి తమిళ రాజకీయాల్లోకి ( Tamil Politics ) వెళ్లనున్నట్లు జోరుగా ప్రచారం జరిగింది.

You may also like
పాదయాత్ర పై జగన్ సంచలన ప్రకటన
‘సీఎం వెన్నుపోటు పొడిచారు..ఓటుకు నోటు దొంగ చెప్పారు’
‘వైసీపీ ప్రజా ప్రతినిధులను కిడ్నాప్ చేస్తున్నారు’
‘హలో ఇండియా..ఏపీ వైపు చూడండి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions