RK Roja News Latest | కూటమి ప్రభుత్వంలో తిరుమల శ్రీవారికే నిదుర కరువైందని విమర్శించారు మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు రోజా.
రోజుకు 23 గంటలకు పైగా దర్శనాలు కొనసాగుతున్నాయని దింతో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి విశ్రాంతి కరువైందని కథనాలు ప్రచురితం అయ్యాయి. ఈ నేపథ్యంలో రోజా స్పందించారు. కూటమి ప్రభుత్వంలో మనుషులకే కాదు, చివరికి ఆ దేవదేవుడికి కూడా నిదుర లేకుండా పోతుందన్నారు.
సంప్రదాయం ప్రకారం, భగవంతుడికి విశ్రాంతి సమయం కేటాయించాలని అది భగవంతుడి కోసమే కాకుండా, మన కోసమూనని పేర్కొన్నారు. జగన్ హయాంలో రోజుకు లక్ష మందికి పైగా భక్తులకు దర్శన భాగ్యం ఉండేవని కానీ ఇప్పుడు స్వామికి నిద్ర లేకుండా చేస్తూ, భక్తుల సంఖ్యను తగ్గిస్తున్నారని రోజా మండిపడ్డారు.
దర్శనాల సంఖ్య 60 వేల చుట్టూ పరిమితం చేస్తూ, రోజుకు 7 నుంచి 10 వేల బ్రేక్ దర్శనాలకు టీటీడీ ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. దీంతో సామాన్య భక్తులకు స్వామి దర్శనం మరింత దూరమవుతోందని, సిఫార్సు లేఖలకు ప్రాధాన్యత ఇచ్చి, డబ్బు ఉన్నవారికే దర్శన అవకాశం కల్పిస్తున్నారని విమర్శలు గుప్పించారు. ఇదేనా కూటమిలోని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీల సనాతన ధర్మం? ఇదేనా చంద్రబాబు నమూనా ప్రక్షాళన? అంటూ రోజా ప్రశ్నించారు.