Rishab Pant Out Controversy | న్యూజీలాండ్ ( Newzealand ) తో జరిగిన మూడవ టెస్టు ( Test ) రెండవ ఇన్నింగ్స్ ( Innings ) లో టీం ఇండియా కేవలం 121 పరుగులకే కుప్పకూలింది. ఓ వైపు టాప్ బ్యాటర్లు పెవిలియన్ బాట పడుతుంటే రిషబ్ పంత్ ( Rishab Pant )మాత్రం ఒంటరి పోరాటం చేశాడు.
57 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్సర్ బాది 64 పరుగులు చేశాడు. పంత్ క్రీజులో ఉన్న సమయంలో టీం ఇండియా గెలుస్తుందని ఫ్యాన్స్ ఆశించారు. కానీ, పంత్ ఔట్ అయ్యాడు. ఇప్పుడు ఈ ఔట్ ( Out ) వివాదంగా మారింది.
అజాజ్ పటేల్ ( Ajaz Patel )వేసిన బాల్ పంత్ ప్యాడ్స్ ( Pads ) కు తగిలి గాల్లోకి లేచింది. వెంటనే వికెట్ కీపర్ క్యాచ్ ( Catch )పట్టి అపీల్ చేశాడు. అయితే అంపైర్ ( Umpire ) నాట్ ఔట్ ఇచ్చాడు. ఈ క్రమంలో న్యూజీలాండ్ రివ్యూ ( Review ) తీసుకుంది. ఇందులో బాల్, బాట్ ( Bat ) ఎడ్జ్ ( Edge ) కు టచ్ అయి, ప్యాడ్స్ ( Pads )ను తగిలినట్లు డీఆర్ఎస్ ( DRS )లో తేలింది.
థర్డ్ అంపైర్ ఔట్ గా ప్రకటించారు. కానీ బ్యాట్ తగిలింది బాల్ ను కాదని, ప్యాడ్స్ ను తగిలినట్లు పంత్ ఫీల్డ్ అంపైర్ దృష్టికి తీసుకెళ్లాడు. ఇప్పుడిదే కాంట్రావెర్సీకి దారి తీసింది. ప్యాడ్లను తాకినప్పుడే స్పైక్స్ వచ్చాయని, బాల్ బ్యాట్ ను తాకలేదని ఫ్యాన్స్ అంటున్నారు.