Rishab Pant Emotional Goodbye To Delhi Capitals | వీడ్కోలు పలకడం ఎప్పుడూ సులభం కాదు అంటూ ఢిల్లీ క్యాపిటల్స్ టీంకు ఎమోషనల్ ( Emotional ) గుడ్ బై చెప్పారు టీం ఇండియా ప్లేయర్ ( Team India Player ) రిషబ్ పంత్.
గత తొమ్మిదేళ్లుగా ఢిల్లీ తరఫున ఆడిన రిషబ్ పంత్ ను మెగా ఆక్షన్ ( Mega Auction ) లో ఐపీఎల్ లోనే అత్యధిక ధర రూ.27 కోట్లకు లక్నో ( Lucknow Super Giants ) దక్కించుకుంది. ఈ క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ తో తన ప్రయాణానికి ముగింపు పలికారు. ఢిల్లీతో తన ప్రయాణం అద్భుతంగా సాగినట్లు చెప్పారు.
ఫీల్డ్ లో ఎన్నో థ్రిల్లింగ్ ( Thrilling ) క్షణాలతో తాను ఊహించని విదంగా ఎదిగినట్లు పేర్కొన్నారు. తఞ్చ యుక్తవయసులో ఢిల్లీ టీంలో చేరినట్లు గుర్తుచేసుకున్నారు. కెరీర్ ( Career ) లోని క్లిష్ట సమయాల్లో అభిమానులు తనకు అండగా నిలిచినట్లు తెలిపారు.
తాను ఇప్పుడు వేరే టీంలోకి వెళ్తున్నా అభిమానుల ప్రేమాభిమానాలు తన గుండెలో పదిలంగా ఉంటాయన్నారు. ఫీల్డ్ లో అందర్నీ ఎంటర్టైన్ చేయడానికి కృషి చేస్తానని పంత్ చెప్పారు. తన ప్రయాణాన్ని ప్రత్యేకంగా చేసినందుకు ఢిల్లీ ఫ్యాన్స్ కు రిషబ్ ధన్యవాదాలు తెలుపుతూ ఎక్స్ వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశారు.