National Anthem Guinness Record | సంప్రదాయ సంగీత విద్వాంసులు, బ్రిటిష్ ఆర్కెస్ట్రా (British Orchestras) మరియు 14వేల మంది ఆదివాసీ చిన్నారులతో నిర్వహించిన జాతీయ గీతాలాపన గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది.
గ్రామీ అవార్డు (Grammy Award) విజేత రీక్కి కేజ్ (Ricky Kej) నిర్వహించిన మన దేశ జాతీయ గీతాలాపన ఈ ఘనతను సాధించింది. తన గానంతో ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం సంపాదించుకున్న భారత సంగీత దర్శకుడు రిక్కీ కేజ్ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని అద్భుతంగా జాతీయ గీతాన్ని రూపొందించారు.
ఇందులో ప్రముఖ క్లాసికల్ మ్యూజిషియన్లు తమ వాయిద్యాలతో జాతీయ గీతాన్ని ప్రత్యేకంగా రూపొందించారు. అలాగే యూకే కు చెందిన రాయల్ ఫిల్ హార్మోనిక్ ఆర్కెస్ట్రా కు చెందిన 100 మంది జాతీయ గీతాలాపన లో పాల్గొన్నారు.
మరోవైపు కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ కు చెందిన 14వేల మంది ఆదివాసీ చిన్నారులు భారత దేశ ఆకృతిలో నిల్చొని మన దేశ గీతాన్ని ఆలపించారు. దీనికి సంబంధించిన వీడియోను రిక్కీ కేజ్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.