KTR News Latest | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై నిప్పులు చెరిగారు బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సీఎం ఒక్క ప్లేట్ భోజనం ఖర్చు రూ.32 వేలు అయితే పేద విద్యార్థులకు మాత్రం గొడ్డు కారం పెడుతున్నారని మండిపడ్డారు.
నల్గొండ మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలోని కృష్ణవేణి హాస్టల్లో ఉదయం టిఫిన్ సందర్భంగా విద్యార్థులకు గొడ్డు కారంతో అన్నం పెడుతున్నారని యాజమాన్యంతో స్టూడెంట్స్ గొడవకు దిగిన వీడియోలు వైరల్ గా మారాయి. ఈ క్రమంలో కేటీఆర్ స్పందించారు.
‘ ముఖ్యమంత్రి ఒక ప్లేట్ భోజనం ఖర్చు ₹32,000 మాత్రమే !! చదువుకునే పేద విద్యార్థులకు గొడ్డు కారం. వారెవ్వా ప్రజాపాలన. శబాష్ ఇందిరమ్మ రాజ్యం’ అంటూ కేటీఆర్ ఫైర్ అయ్యారు.
కాగా గతేడాది నవంబర్ 20న కాంగ్రెస్ ప్రజా పాలన విజయోత్సవ సభను వేములవాడలో నిర్వహించిన విషయం తెల్సిందే. ఈ సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి, మంత్రులు సహా 100 మంది భోజనాల ఖర్చు రూ.32 లక్షలు అయినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. వీటినే తాజగా కేటీఆర్ ప్రస్తావించారు.