Friday 20th March 2026
12:07:03 PM
Home > తెలంగాణ > తెలంగాణ నూతన సీఎంగా రేపు ప్రమాణస్వీకారం చేయనున్న రేవంత్

తెలంగాణ నూతన సీఎంగా రేపు ప్రమాణస్వీకారం చేయనున్న రేవంత్

Revanth will take oath as the new CM of Telangana tomorrow

-అధిష్ఠానం పిలుపుతో నిన్న హస్తినకు పీసీసీ చీఫ్
-ఈ ఉదయం మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్‌తో భేటీ

తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేపు (డిసెంబరు 7న) ప్రమాణ స్వీకారం చేయబోతున్న రేవంత్‌రెడ్డి ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. అధిష్ఠానం పిలుపుతో నిన్న సాయంత్రం అకస్మాత్తుగా ఆయన ఢిల్లీ వెళ్లారు. ఆయన ఢిల్లీ చేరుకోవడానికి ముందే ముుఖ్యమంత్రిగా రేవంత్ పేరును అధిష్ఠానం ప్రకటించింది.
ఢిల్లీ వెళ్లిన రేవంత్ ఈ ఉదయం పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయ్యారు. సీఎల్పీ నేతగా తనను ప్రకటించినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. మరికాసేపట్లో పార్టీ అగ్రనేతలైన సోనియాగాంధీ, రాహుల్‌గాంధీతో భేటీ అవుతారు. మంత్రివర్గ ఏర్పాటు, ఇతర అంశాలపై వారితో చర్చిస్తారు. అలాగే, ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వారిని ఆహ్వానిస్తారని సమాచారం.

You may also like
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !
Minister Adluri Laxman
‘గోదావరి పుష్కరాలు ఘనంగా నిర్వహించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions