Thursday 24th April 2025
12:07:03 PM
Home > తాజా > రజినీకి రేవంత్ ఆహ్వానం.. కాంగ్రెస్ ప్రభుత్వంలో తొలి కొలువు ఆమెకే!

రజినీకి రేవంత్ ఆహ్వానం.. కాంగ్రెస్ ప్రభుత్వంలో తొలి కొలువు ఆమెకే!

revanth reddy rajini

Revanth Reddy Invites Rajini | టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రేపు ఎల్బీ స్టేడియంలో తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేపటి నుంచి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరనుంది.

ఈ నేపథ్యంలో తన ప్రమాణ స్వీకారోత్సవానికి రేవంత్ ఓ దివ్యాంగురాలికి ఆహ్వానం పలికారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తొలి ఉద్యోగం నీకే ఇస్తామని ఈ ఏడాది అక్టోబరు‌లో రజినీ అనే దివ్యాంగురాలికి హామీ ఇచ్చారు.

తాను పీజీ పూర్తి చేసినా కూడా అటు ప్రైవేటులో, ఇటు ప్రభుత్వంలో ఎక్కడా ఉద్యోగం రాలేదని హైదరాబాద్ నాంపల్లికి చెందిన దివ్యాంగురాలు  మరుగుజ్జు రజినీ అనే అమ్మాయికి రేవంత్ రెడ్డిని కలిసి తన ఆవేదనను వ్యక్తం చేసింది.

రజినీ బాధను విన్న రేవంత్ రెడ్డి.. డిసెంబర్ 9న ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ సీఎం ప్రమాణ స్వీకారం ఉంటుందని.. ఆ సభకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే వస్తారని చెప్పుకొచ్చారు. అదే రోజున, వాళ్ల ముందే కాంగ్రెస్ ప్రభుత్వం తొలి ఉద్యోగం నీకే ఇస్తుందని రజనికీ హామీ ఇచ్చారు.

ఇది తన గ్యారంటీ అని రేవంత్ స్పష్టం చేయటంతో పాటు స్వయంగా కాంగ్రెస్ గ్యారంటీ కార్డును రజినీ పేరుతో రాసి ఇచ్చారు.

ఈ నేపథ్యంలోనే రేపు సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించిన రేవంత్ తన హామీ మేరకు రజినీకే తొలి ఇద్యోగం ఉచ్చేందుకు సిద్ధమయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఆమెకు ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగం ఇవ్వనున్నట్లు తెలిసింది.

You may also like
‘పాక్ ప్రధానిపై నిప్పులుచేరిగిన ఆ దేశ మాజీ క్రికెటర్’
‘పహల్గాం ఉగ్రదాడి..ఢిల్లీలోని పాక్ హైకమిషన్ లో సంబరాలు?’
చైనా లో ‘గోల్డ్ ఏటీఎం’..30 నిమిషాల్లో బ్యాంకులోకి నగదు
‘నన్ను మోసం చేశాడు..పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన పదేళ్ల బాలుడు’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions