Wednesday 13th August 2025
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ‘తండ్రి సేవలను అర్థం చేసుకుంది..’ ఆద్యపై రేణు దేశాయ్ పోస్ట్!

‘తండ్రి సేవలను అర్థం చేసుకుంది..’ ఆద్యపై రేణు దేశాయ్ పోస్ట్!

Aadya with her father pk

Renu Desai Post on Insta | 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కుమార్తె ఆద్య కూడా తండ్రితో కలిసి వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్బంగా పవన్ తన కుమార్తె ఆద్యతో సెల్ఫీ తీసుకున్నారు.

ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫొటోను ఇన్స్టాలో షేర్ చేస్తూ ఆద్య తల్లి రేణు దేశాయ్ ఓ పోస్ట్ రాసుకొచ్చారు. నాన్నతోపాటు స్వాతంత్య్ర దినోత్సవానికి వెళ్లనా అని ఆద్య నన్ను అడిగింది.

తండ్రితో టైం స్పెండ్ చేయాలనుకోవడం, ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తుల జీవితం ఎలా ఉంటుందో తను చూడాలనుకోవడం నాకు సంతోషం కలిగించింది.

ఏపీ ప్రజల కోసం తన తండ్రి చేసే సేవలను ఆద్య అర్థం చేసుకుంది. ఆయణ్ని ప్రశంసించింది అని రేణూ దేశాయ్ తన ఇన్ స్టాలో పోస్ట్ చేశారు.

You may also like
‘పెట్టుబడులు రాకుండా ఈ-మెయిల్స్ పంపాడు..ఎవరంటే!’
‘బాధితుల కోసం యాప్..మనం వచ్చాక సినిమా చూపిద్దాం’
‘మహిళలకు రూ.1500..అమలు చేయాలంటే ఆంధ్రాను అమ్మాలి’
ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలు..నారా భువనేశ్వరి ఆగ్రహం

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions