Friday 30th January 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > దిల్లీ ముఖ్యమంత్రి పై వీడిన ఉత్కంఠ.. కొత్త సీఎం ఎవరంటే!

దిల్లీ ముఖ్యమంత్రి పై వీడిన ఉత్కంఠ.. కొత్త సీఎం ఎవరంటే!

rekha gupta as delhi cm

Delhi New CM | దిల్లీ కొత్త సీఎం (Delhi New CM) ఎవరనే అంశంపై కొనసాగిన సస్పెన్స్ ముగసింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ నుంచి సీఎంగా రేఖా గుప్తా (Rekha Gupta) నియమితులయ్యారు. తొలుత పలువురి పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ చివరికి రేఖా గుప్తా వైపే బీజేపీ అధిష్ఠానం మొగ్గు చూపింది.

ఏబీవీపీ నుంచి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఆమె బీజేపీలోని పలు విభాగాల్లో క్రియాశీలంగా పనిచేశారు. దిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్షురాలిగానూ గతంలో సేవలందించారు.

ప్రస్తుతం ఢిల్లీ బిజెపి ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆమె గతంలో బిజెపి మహిళా మోర్చా జాతీయ ఉపాధ్యక్షురాలిగా పనిచేశారు. 2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె షాలిమార్ బాగ్ (వాయువ్య) స్థానాన్ని 68,200 ఓట్లతో గెలుచుకున్నారు.

రేపే ప్రమాణ స్వీకారం..

దిల్లీ కొత్త సీఎం పేరు ప్రకటించిన నేపథ్యంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.

గురువారం రాంలీలా మైదానంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12.34 గంటల వరకు ప్రమాణస్వీకారోత్సవం జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భారీ ఎత్తున నిర్వహించే ఈ కార్యక్రమానికి భాజపా అగ్ర నేతలతో పాటు భాజపా, ఎన్డీయే పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరు కానున్నారు.

You may also like
cm rekha gupta
ఢిల్లీలో షాకింగ్ ఘటన.. సీఎం రేఖా గుప్తపై దాడి!
ఢిల్లీ సీఎంగా రేఖా గుప్త ప్రమాణ స్వీకారం..!
delhi earthquake
ఢిల్లీలో భూకంపం.. సీసీ కెమెరాల్లో రికార్డైన విజువల్స్!
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఇవే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions