RCB top list of most defeats at home | ఐపీఎల్-2025లో భాగంగా గురువారం బెంగళూరు స్టేడియం వేదికగా ఆర్సీబీ-ఢిల్లీ క్యాపిటల్స్ తలపడ్డాయి. లక్ష్య చేదనలో భాగంగా కెఎల్ రాహుల్ 93 పరుగులు సాధించి ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించారు.
ఈ క్రమంలో ఆర్సీబీ సొంత మైదానంలో ఓటమిపాలయ్యింది. ఇప్పటివరకు ఐదు మ్యాచులు ఆడిన ఆర్సీబీ మూడింట్లో గెలిచింది. అయితే ఈ మూడు మ్యాచులు బెంగుళూరు ఆవల ఆడినవే. చిన్నస్వామి స్టేడియంలో ఈ సీజన్ లో ఆడిన రెండింట్లో కూడా బెంగళూరు ఓడింది.
డీసీ చేతిలో పరాజయం పాలైన ఆర్సీబీ ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. సొంత మైదానంలో ఆర్సీబీ ఇప్పటివరకు 45 మ్యాచులను ఓడింది. ఒకే స్టేడియంలో అత్యధిక మ్యాచులను ఓడిన టీంగా బెంగళూరు నిలిచింది. రెండవ స్థానంలో డీసీ నిలిచింది.
ఢిల్లీ స్టేడియం లో డీసీ ఇప్పటివరకు 44 మ్యాచులను ఓడింది. ఇకపోతే విజయం తర్వాత రాహుల్ చేసుకున్న సంబరాలు వైరల్ గా మారాయి. బెంగళూరు లోకల్ బాయ్ రాహుల్ ‘ఇది నా స్టేడియం’ అని అర్ధం వచ్చే విధంగా సెలబ్రేషన్స్ చేసుకున్న విషయం తెల్సిందే.