Saturday 31st January 2026
12:07:03 PM
Home > క్రీడలు > మూడు మ్యాచుల కోసం కెప్టెన్ ను ప్రకటించిన రాజస్థాన్

మూడు మ్యాచుల కోసం కెప్టెన్ ను ప్రకటించిన రాజస్థాన్

Rajasthan Royals announce Riyan Parag as new captain | ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( IPL ) శనివారం నుండి ప్రారంభం కానుంది. ఈ క్రమంలో రాజస్థాన్ రాయల్స్ కీలక నిర్ణయం తీసుకుంది.

జట్టు కెప్టెన్ గా సంజు శాంసన్ ( Sanju Samson ) ని గతంలోనే రాజస్థాన్ ప్రకటించిన విషయం తెల్సిందే. అయితే తొలి మూడు మ్యాచుల కోసం మాత్రం యువ ఆటగాడు రియాన్ పరాగ్ జట్టుకు సారథ్యం వహించనున్నట్లు రాజస్థాన్ యాజమాన్యం గురువారం ప్రకటించింది.

ఇంగ్లాండ్ తో జరిగిన టీ-20 సిరీస్ సందర్భంగా సంజు శాంసన్ వెలికి గాయం అయింది. ప్రస్తుతం సంజు గాయం నుండి కొలుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మరికొద్ది రోజుల వరకు వికెట్ కీపింగ్ కు దూరంగా ఉండాలని బీసీసీఐ మెడికల్ టీం సంజుకు సూచించింది.

దింతో అతను తొలి మూడు మ్యాచులకు ఇంపాక్ట్ ప్లేయర్ ( Impact Player ) గా మాత్రమే బరిలోకి దిగుతాడు. కానీ ఇంపాక్ట్ ప్లేయర్ కెప్టెన్ గా వ్యవహరించకూడదు కాబట్టి యాజమాన్యం రియాన్ పరాగ్ ను తొలి మూడు మ్యాచుల కోసం సారథి గా నియమించింది.

తాను పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించలేదని, ఫిట్నెస్ సాధించే వరకు పరాగ్ కెప్టెన్ గా వ్యవహరిస్తారని సంజు శాంసన్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ నేపథ్యంలో రియాన్ పరాగ్ తొలిసారి కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టనున్నారు. మార్చి 23 న హైదరాబాద్, మార్చి 26న కోల్కత్తతో, మార్చి 30న చెన్నైతో రాజస్థాన్ తలపడనుంది.

You may also like
‘లేడికి-లేడి గెటప్ కు తేడా తెలీదా’..జగన్ కు కమెడియన్ కౌంటర్
పాడి కౌశిక్ పై ఎంఐఎం, ఐపీఎస్ సంఘం తీవ్ర ఆగ్రహం
ఖమ్మం మంత్రిపై వైఎస్ జగన్ కు ఫిర్యాదు
social media code for govt servants
వారు సోషల్ మీడియా వాడాలంటే అనుమతి తప్పనిసరి.. ఎక్కడంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions