Saturday 10th May 2025
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > రాజమండ్రి రూరల్ కోసం.. టీడీపీ వర్సెస్ జనసేన!

రాజమండ్రి రూరల్ కోసం.. టీడీపీ వర్సెస్ జనసేన!

tdp janasena

Rajamundry Rural Assembly | సార్వత్రిక ఎన్నికలకు టీడీపీ‌‌-జనసేన (TDP-Janasena) పార్టీలు కూటమిగా వెళ్తున్న విషయం తెలిసిందే. అయితే ఇరు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు విషయం మాత్రం ఇప్పటివరకు ఒక కొలిక్కి రాలేదు.

ఈ నేపథ్యంలో రాజమండ్రి రూరల్ (Rajamundry Rural) నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారింది. గత మంగళవారం రాజమండ్రి జనసేన నేతలతో భేటీ అయిన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ రాజమండ్రి రూరల్ స్థానంలో జనసేన పోటీ చేస్తుందని చెప్పినట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది.

అయితే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, రాజమండ్రి రూరల్ సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి (Gorantla Bucchaiah Chowdhary) ఉండగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

ఈ క్రమంలో స్పందించిన బుచ్చయ్య చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. వస్తున్న వార్తలు కేవలం ఊహాజనితం మాత్రమేనని తెలిపారు.

చంద్రబాబు (Chandra Babu) ఆదేశానుసారం కచ్చితంగా తానే పోటీ చేస్తానని, ఇందులో ఎటువంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి చంద్రబాబు త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తారని పేర్కొన్నారు గోరంట్ల.

You may also like
‘చక్రవర్తి ఫిడేలు వాయించినట్లుగా చంద్రబాబు తీరు’
ap high court
మతం మారితే కులం వర్తించదు.. ఏపీ హైకోర్టు కీలక తీర్పు!
pawan kalyan
నేటి నుంచి వాళ్లను అలా పిలవొద్దు.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ విజ్ఞప్తి!
‘కరుంగాలి కంబు’తో పవన్ కళ్యాణ్ ను సత్కరించిన తమిళనాడు నేత

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions