Thursday 21st November 2024
12:07:03 PM
Home > తాజా > Rain Alert: రాగల ఐదు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు!

Rain Alert: రాగల ఐదు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు!

Hydrabad Rains

Rain Alert | హైదరాబాద్ (Hyderabad) నగరంలో గురువారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం (weather) మారిపోయింది. ఎండలు, ఉక్కపోత తో ఇబ్బంది పడుతున్న ప్రజలకు వర్షం రూపంలో భారీ ఉపశమనం లభించింది.

అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఇతర జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఇదిలా ఉండగా రాగల ఐదు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

గురువారం రంగారెడ్డి, మెదక్,  మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, ఉమ్మడి నల్గొండ, సంగారెడ్డి, జోగులంబా గద్వాల, నారాయణపేట, వనపర్తి జిల్లాల్లో గంటకు 40 నుండి 50 కీ. మీ. వేగంతో గాలులతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.

అలాగే మరో ఐదు రోజులపాటు ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ అయ్యింది. ఇదిలా ఉండగా కురుస్తున్న వర్షాలతో ప్రజలకు ఉపశమనం లభించినా, వాహనదారులకు మాత్రం ఇబ్బందులు తప్పడంలేదు.

You may also like
ఖమ్మం వరదలు..బాధితుల కోసం కాంగ్రెస్ భారీ విరాళం
Rain Alert
తెలంగాణకు వాతావరణ శాఖ మరో హెచ్చరిక!
వరద బాధితులకు రూ.100 కోట్లు..తెలంగాణ ఉద్యోగుల ప్రకటన
వరద బాధితులకు అండగా జూనియర్ ఎన్టీఆర్

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions