Rahul Ravindran’s Mangalsutra Remark’s | నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ మంగళసూత్రంపై తాజగా చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. రాహుల్ దర్శకత్వం వహించిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ మూవీ త్వరలో రిలీజ్ కానుంది.
ఈ నేపథ్యంలో రాహుల్ ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సింగర్ చిన్మయితో వివాహం జరిగిన అనంతరం తాళిబొట్టుపై తన అభిప్రాయాన్ని స్పష్టం చేసినట్లు రాహుల్ పేర్కొన్నారు. మంగళసూత్రం ధరించాలా, వద్దా అనేది పూర్తిగా నీ ఇష్టం అని చిన్మయికి సూచించినట్లు చెప్పారు. తానైతే మంగళసూత్రం ధరించాల్సిన అవసరం లేదని చెప్పినట్లు తెలిపారు.
కారణం అందరూ సమానమే అని భావిస్తానని మంగళసూత్రం భట్టి మహిళలకు వివాహం జరిగిందా లేదా అనేది తెలుస్తుంది, కానీ అబ్బాయిలకు అలాంటి ఆధారం ఏదీ లేదన్నారు. అందుకే చిన్మయిని కూడా మంగళసూత్రం ధరించవద్దని సూచించినట్లు అయినప్పటికీ చిన్మయి తాళిబొట్టు, నుదుటన సింధూరం పెట్టుకుంటుందని చెప్పారు.









