Rahul Gandhi Comments | కాంగ్రెస్ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం భారత్ జోడో న్యాయ యాత్ర ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతుంది. ఈ సందర్భంగా మాట్లాడిన రాహుల్ గాంధీ..
“అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి అంబానీని పిలిచారు. అలాగే అమితాబ్ బచ్చన్ ను పిలిచారు కానీ దేశ రాష్ట్రపతి ద్రౌపది Murmu ను ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు. ఎందుకంటే రాష్ట్రపతి ఒక గిరిజన మహిళ కాబట్టే అయోధ్య రామాలయ ప్రారంభానికి ఆహ్వానించలేదని విమర్శించారు.
అలాగే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ లకు చెందిన ఏ ఒక్కరినీ ఆ కార్యక్రమానికి పిలవలేదని మండిపడ్డారు. పీఎం మోదీ తనను తాను ఓబీసీ చెప్పుకుంటాడాని కానీ, మోదీ ఓబీసీ కులం లో జన్మించలేదని పేర్కొన్నారు. ఆయన కులాన్ని గుజరాత్ ప్రభుత్వం ఓబీసీ లో చేర్చిందని గుర్తుచేశారు రాహుల్.