Rahul Gandhi On Tirumala Laddu Issue | కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమలలో భక్తులకు అంధించే లడ్డూలో వాడిన నెయ్యిపై తీవ్ర వివాదం నెలకొంది.
గత వైసీపీ ప్రభుత్వంలో లడ్డూలో ఆవు నెయ్యికి బదులు జంతుకొవ్వుతో తయారుచేసే నెయ్యిని వినియోగించారని తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఈ అంశంపై దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చ నడుస్తోంది.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్ర నాయకులు, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలోని శ్రీవారి ఆలయంలో ప్రసాదం అపవిత్రమైందన్న వార్తలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని ఆయన తెలిపారు.
శ్రీవారు భారతదేశం మరియు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులకు పరమ పవిత్రమైన భగవానుడు. కానీ ఈ అంశం ప్రతీ భక్తుడ్ని బాధిస్తుంది. లడ్డూ నాణ్యత అంశంపై క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
అలాగే దేశంలోని మతపరమైన ప్రదేశాల పవిత్రతను అధికారులు కాపాడాలని రాహుల్ గాంధీ సూచించారు.