Wednesday 23rd April 2025
12:07:03 PM
Home > తాజా > పుష్ప-2 లో స్పెషల్ సాంగ్..అల్లు అర్జున్ పక్కన ఆ హీరోయిన్

పుష్ప-2 లో స్పెషల్ సాంగ్..అల్లు అర్జున్ పక్కన ఆ హీరోయిన్

Pushpa-2 Special Song | పుష్ప 2 ది రూల్ ( Pushpa 2 The Rule ) కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అల్లు అర్జున్ ( Allu Arjun )ప్రధాన పాత్రలో సుకుమార్ ( Sukumar ) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 5న విడుదల అవనుంది.

ఈ క్రమంలో ఈ మూవీకి సంబంధించిన ఓ వార్త నెట్టింట్లో వైరల్ గా మారింది. సుకుమార్ మూవీ అంటే అందులో కచ్చితంగా ఓ స్పెషల్ సాంగ్ ( Special Song ) ఉంటుంది. 2021 లో విడుదలైన పుష్ప లో కూడా సమంత స్పెషల్ సాంగ్ లో కనిపించారు.

అల్లు అర్జున్ సమంత కలిసి చేసిన పాట బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ క్రమంలో పుష్ప 2 లో కూడా స్పెషల్ సాంగ్ ఉండనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ స్పెషల్ సాంగ్ లో యువ నటి శ్రీలీల ( Sree Leela ) అల్లు అర్జున్ సరసన డాన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది.

మొదట ఈ పాటలో బాలీవుడ్ హీరోయిన్ శ్రద్దా కపూర్ ( Shradda Kapoor ) కనిపిస్తారని వినిపించినా శ్రీలీల ఫిక్స్ అయినట్లు సమాచారం. అల్లు అర్జున్, శ్రీలీల ఇద్దరూ కూడా డాన్స్ విషయంలో సూపర్ టాలెంట్ ఉంది. దింతో పుష్ప 2 మూవీలోని స్పెషల్ సాంగ్ కు థియేటర్లు దద్దరిల్లడం గ్యారంటీ అంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.

You may also like
చైనా లో ‘గోల్డ్ ఏటీఎం’..30 నిమిషాల్లో బ్యాంకులోకి నగదు
‘నన్ను మోసం చేశాడు..పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన పదేళ్ల బాలుడు’
‘రూ.2.5 కోట్లు మనీ లాండరింగ్..మహేష్ బాబుకు ఈడీ నోటీసులు’
‘లిక్కర్ దొంగల బట్టలు సగమే విప్పారు’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions