Thursday 21st November 2024
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > వయనాడ్ బాధితుల కాంగ్రెస్ నిర్మించిన ఇంటికి ప్రియాంక గాంధీ!

వయనాడ్ బాధితుల కాంగ్రెస్ నిర్మించిన ఇంటికి ప్రియాంక గాంధీ!

priyanka gandhi

Priyanka Gandhi In Wayanad | గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) కేరళ లోని వాయనాడ్ (Wayanad), యూపీలోని అమేథి (Amethi) నుంచి పోటీ చేసి రెండు చోట్లా గెలుపొందారు.

అనంతరం వాయనాడ్ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది. ఈ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా రాహుల్ సోదరి ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) బరిలోకి దిగారు. పోలింగ్ తేది దగ్గర పడుతుండటంతో ప్రియాంక ఎన్నికల ప్రచార జోరు పెంచారు.

అందులో భాగంగా ఆమె ఇటీవల వయనాడ్ వరద బాధితులను పరామర్శిస్తున్నారు. ఇండ్లు కోల్పోయిన బాధితులను కలిశారు. కాగా, వరదల్లో తమ ఇల్లు కోల్పోయిన ఓ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ కొత్త ఇల్లు నిర్మించి ఇచ్చింది.

ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ మంగళవారం ఆ ఇంటిని సందర్శించారు. ఇల్లంతా కలియదిరుగుతూ ఆ కుటుంబంతో ముచ్చటించారు. ఈ వీడియోను కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్ అవుతోంది.

You may also like
Convoy leaving for LB Stadium
ఎల్బీ స్టేడియానికి బయలుదేరిన కాన్వాయ్
congress party
కాంగ్రెస్ లోకి మాజీ మంత్రి..ముహూర్తం ఫిక్స్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions