Prashant Kishore Latest News | బీహార్ ( Bihar )లో జన్ సురాజ్ పార్టీ ( Jan Suraaj Party )ని స్థాపించి జనాల్లోకి వెళ్తున్న ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తాజగా విమర్శల పాలవుతున్నారు.
ఇటీవల బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ప్రిలిమినరీ ( Preliminary ) పరీక్షలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వస్తున్నాయి. పరీక్ష అభ్యర్థులు సైతం రోడ్డెక్కారు. ఈ క్రమంలో పరీక్షను రద్దు చేసి, కొత్తగా మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ప్రశాంత్ కిషోర్ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు.
పట్నాలోని గాంధీ మైదాన్ ( Gandhi Maidan ) లో మహాత్ముడి విగ్రహం ముందు ఆయన నిరశన చేస్తున్నారు. అయితే వేదిక పక్కనే ఓ లగ్జరీ వ్యాన్ దర్శనమిచ్చింది. అది ప్రశాంత్ కిషోర్ కు చెందిందే. అందులో ఏసీ, కిచెన్ ( Kitchen ), బెడ్రూం ( Bedroom ) వంటి సదుపాయాలు ఉన్నాయి.
దీనిపై రాజకీయ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో లగ్జరీ వ్యాన్ ( Luxury Van ) పై కాదు, పట్టించుకోవాల్సింది విద్యార్థుల భవిష్యత్ గురించి అంటూ జన్ సురాజ్ పార్టీ ప్రతినిధులు స్పందిస్తున్నారు.









