Tuesday 17th March 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > తిరుమల లడ్డూ వివాదం..పవన్ కు ప్రకాష్ రాజ్ కౌంటర్

తిరుమల లడ్డూ వివాదం..పవన్ కు ప్రకాష్ రాజ్ కౌంటర్

Prakash Raj Counter To Pawan Kalyan | తిరుమల ( Tirumala )శ్రీవారి లడ్డూలో జంతుకొవ్వు ( Animal Fat )ను వినియోగించారని వస్తున్న ఆరోపణలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. లడ్డూలో జంతుకొవ్వును వాడారనే అంశం తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు పవన్. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీటీడీ బోర్డు ( TTD Board ) ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

అలాగే భారత్‌లోని దేవాలయాలకు సంబంధించిన అన్ని సమస్యలను పరిశీలించేందుకు జాతీయ స్థాయిలో ‘సనాతన ధర్మ రక్షణ బోర్డు’ని ఏర్పాటు చేయాల్సిన సమయం ఆసన్నమైందని డిప్యూటీ సీఎం అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. ‘ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా మీరు ఉన్న రాష్ట్రంలో ఈ ఘటన జరిగింది. విచారణ చేసి నేరస్తులను పట్టుకుని కఠినంగా శిక్షించండి. కానీ, మీరు ఆందోళనలను ఎందుకు వ్యాపింపజేస్తున్నారు మరియు సమస్యను జాతీయంగా ఊదరగొడుతున్నారు…కేంద్రంలో ఉన్న మీ స్నేహితుల మూలంగా దేశంలో మనకు తగినంత మతపరమైన ఉద్రిక్తతలు ఉన్నాయి. ‘ అని ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు.

You may also like
శ్రీవారి ఫోటోలు తీసేసి జీసస్ ఫోటోలు..YSRపై చంద్రబాబు సంచలనం!
‘సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు’..పవన్ సంచలనం
పవన్ కళ్యాణ్ కోర్టుకు రావాలి.. షాకిచ్చిన హైదరాబాద్ సిటీ కోర్టు
prakashraj
పవన్ ని టార్గెట్ చేస్తూ ప్రకాశ్ రాజ్ మరో ట్వీట్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions