Ponguleti Srinivas Reddy | తెలంగాణలో గురువారం కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. సీఎంగా రేవంత్ రెడ్డితోపాటు (Revanth Reddy) మరో 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అందులో ఖమ్మం నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) కూడా ఉన్నారు.
ఈ సందర్భంగా మంత్రిగా ప్రమాణం చేసిన పొంగులేటి ఓ అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు. ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టకుండానే మంత్రి పదవి దక్కించుకున్నారు. 2014లో వైసీపీ నుంచి రాజకీయ జీవితం ప్రారంభించిన ఆయన ఆ ఎన్నికల్లో ఖమ్మం ఎంపీగా గెలుపొందారు.
అనంతరం బీఆరెఎస్ లో చేరారు. 2018లో బీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డారు. అనంతరం జరిగిన పరిణామాలతో 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ లో చేరి ఘన విజయం సాధించిన పొంగులేటి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
ఇలా అసెంబ్లీలో అడుగు పెట్టకుండానే నేడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి అరుదైన రికార్డు సొంతం చేసుకన్నారు. తాజాగా తెలంగాణ నూతన సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ లో చోటు దక్కించుకున్నారు.