Sunday 22nd February 2026
12:07:03 PM
Home > తాజా > తెలగాణ తేజం ‘కొమురం భీం’ను కీర్తించిన ప్రధాని

తెలగాణ తేజం ‘కొమురం భీం’ను కీర్తించిన ప్రధాని

PM Modi remembers Telangana revolutionary Komaram Bheem in ‘Mann Ki Baat’ | తెలంగాణ వీర యోధుడు కొమురం భీంను కీర్తించారు ప్రధాని నరేంద్ర మోదీ. మన్ కీ బాత్ 127వ ఎపిసోడ్ లో భాగంగా ప్రధాని జాతినుద్దేశించి మాట్లాడారు.

ఈ సందర్భంగా కొమురం భీం గురించి మాట్లాడుతూ.. ’20వ శతాబ్దం ప్రారంభం, ఆ కాలంలో స్వాతంత్ర్యం సాధిస్తామనే ఆశ ఎక్కడా కనిపించలేదు. బ్రిటిష్‌ వారి దోపిడీకి హద్దు లేకుండా పోయింది. ఆ కాలంలో హైదరాబాద్‌లోని ప్రజలపై అణచివేత మరింత భయానకంగా ఉండేది. ప్రజలు క్రూరమైన, కనికరం లేని నిజాం దురాగతాలను కూడా భరించవలసి వచ్చింది. పేదలు, గిరిజన సమాజాలపై జరిగే దురాగతాలకు హద్దులు లేవు. అలాంటి కష్టకాలంలో సుమారు 20 ఏళ్ల యువకుడు ఈ అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడ్డాడు. ఈ అణచివేతకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ఆ యువకుడు నిజాం అధికారిని చంపేశారు. అంతేకాదు అరెస్టు నుంచి తప్పించుకోవడంలో కూడా విజయవంతమయ్యారు. నేను మాట్లాడుతున్నది కొమరం భీమ్ గురించి. అక్టోబర్ 22న ఆయన జయంతిని జరుపుకున్నాం. కొమురం భీం ప్రజల హృదయాల్లో, ముఖ్యంగా గిరిజన సమాజంలో చెరగని ముద్ర వేశారు” అని ప్రధాని పేర్కొన్నారు. విప్లవాత్మక స్వాతంత్ర్య సమరయోధుడి గురించి యువత వీలైనంత ఎక్కువ తెలుసుకోవాలని కోరారు.

You may also like
bravery girl saves toddlers for faulty elevator
లిఫ్ట్ ప్రమాదం నుంచి చిన్నారులను కాపాడిన బాలిక.. వీడియో వైరల్!
మహిళలకు ఉచిత ప్రయాణంలో కీలక మార్పు.. ఇక మరింత సులభం!
carlos turcios comments on hanuman statue
టెక్సాస్ లో 90 అడుగుల హనుమాన్ విగ్రహంపై అమెరికన్ సంచలన వ్యాఖ్యలు!
Fire breaks out at Aditya Enclave
HYD- అమీర్ పేట్ లో అగ్ని ప్రమాదం!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions