Pm Modi On Medaram Jathara| ప్రతి రెండేండ్లకు ఒకసారి జరిగే మేడారం ( Medaram ) సమ్మక్క సారక్క ( Sammakka-Sarakka ) ల జాతర బుధవారం నుండి ప్రారంభం అయ్యింది.
దక్షిణ భారత కుంభమేళా ( Kumbhamela )గా పేరొందిన మేడారం జాతరలో వనదేవతలకు మొక్కులు చెల్లించడానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు.
బుధవారం నుండి మొదలుకొని, నాలుగు రోజుల పాటు ఈ జాతర ఘనంగా జరగనుంది. ఈ నేపథ్యంలో మేడారం జాతర ప్రారంభం సందర్బంగా శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని మోదీ ( Pm Modi ).
” గిరిజనుల అతిపెద్ద పండుగలలో ఒకటైన, మన సాంస్కృతిక వారసత్వానికి చిరకాల స్ఫూర్తిగా నిలిచే చైతన్యవంతమైన వ్యక్తీకరణ అయిన ఈ సమ్మక్క-సారక్క మేడారం జాతర ప్రారంభోత్సవానికి శుభాకాంక్షలు. ఈ జాతర భక్తి, సంప్రదాయం, సమాజ స్ఫూర్తిల గొప్ప కలయిక. మనం సమ్మక్క-సారక్కలకు ప్రణమిల్లుదాం, వారు అభివ్యక్తీకరించిన ఐక్యతా స్ఫూర్తిని, పరాక్రమాన్ని గుర్తుచేసుకుందాం.” అని తెలిపారు మోదీ.
ఈ మేరకు ఎక్స్ ( X ) వేదికగా పోస్ట్ చేశారు.