Pizza In Sanskrit | యువత ఎంతగానో ఇష్టపడి తినే పిజ్జా ( Pizza )ను సంస్కృతంలో ఏమంటారో తెలుసా ! ఇతర దేశాల వంటకాల పేర్లను భారతీయ భాషలో ఏమంటారో అనేది తెలుసుకోవాలని ప్రతీ ఒక్కరికీ అసక్తిగానే ఉంటుంది.
ఈ క్రమంలో ఓ నెటిజన్ సంస్కృతంలో పిజ్జాను ఏమంటారో అని తెలియజేస్తూ ఒక వీడియోను పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింట్లో వైరల్ గా మారింది. వీడియోలో వ్యక్తి పిజ్జాను తింటున్నారు.
ఇదే సమయంలో ఏం తింటున్నావ్ అంటూ ఓ మహిళ సంస్కృతంలో అతన్ని ప్రశ్నించారు. దీనికి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా సదరు వ్యక్తి ‘ పిస్టజం’ అని బదులిచ్చారు.
సాలుంకే అనే వ్యక్తి మహారాష్ట్రకు చెందిన వ్యక్తి. సంస్కృతం భాషపై పట్టున్న ఆయన వివిధ పదాలను సంస్కృతంలో ఏమని పిలుస్తారో అని వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు.
పిజ్జా అనేది పిండితో చేసే వంటకం. పిండిని పిస్ట్ ( Pist ) అని పిలుస్తారని, ఈ రకంగా పిజ్జాను పిస్ట్ జం అని ఉచ్చరించాలని ఆయన వివరించారు.