Ayodhya Ram Mandir on Jan 1st | నూతన సంవత్సర వేడుకల వేళ అయోధ్య రామ మందిరం భక్తులతో కిక్కిరిసి పోయింది. జనవరి 1న బాల రాముడి దర్శనానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పోటెత్తారు. బుధవారం ఒక్క రోజులోనే 2 లక్షలకు పైగా భక్తులు అయోధ్య రామాలయాన్ని సందర్శించారు.
ఆయోధ్యలోని రామాలయం ప్రాంగణం అంతా భక్తులతో నిండి పోయింది. రెండు కిలోమీటర్ల మేర క్యూ లైన్లు ఏర్పడ్డాయి. ఉదయం 3 గంటల నుంచే భక్తులు ఆలయాన్ని చేరుకున్నారు. బుధవారం కేవలం 15 నిమిషాలు మాత్రమే గుడి మూసివేసినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.
స్థానిక హోటళ్లు, ధర్మశాలలు ముందుగానే నిండిపోయినట్లు అయోధ్య రామందిన ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. భద్రత కోసం ప్రత్యేక ఏర్పాట్లు, డ్రోన్ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.