PCC Chief Mahesh Kumar Wins Black Belt in Karate Competition | తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కరాటేలో బ్లాక్ బెల్ట్ అందుకున్నారు.
హైదరాబాద్ వెస్ట్ మారేడుపల్లిలోని వైడబ్ల్యూసీఏ లో సోమవారం మూడు గంటల పాటు నైపుణ్య పరీక్షలో విజయం సాధించిన మహేష్ కుమార్ గౌడ్ కు ఒకినవా మార్షల్ ఆర్ట్స్ అకాడెమీ నుంచి గ్రాండ్ మాస్టర్ ఎస్.శ్రీనివాసన్ బ్లాక్ బెల్ట్ డాన్ 7 ను ప్రధానం చేశారు. ఈ మేరకు ధ్రువపత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ మాట్లాడుతూ..మార్షల్ ఆర్ట్స్ తన జీవితంలో ఓ భాగమని పేర్కొన్నారు. కరాటే ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని, ఆత్మవిశ్వాసానికి ఆత్మస్థైర్యానికి కరాటే ఎంతో అవసరమన్నారు. యువత చెడు వ్యసనాల బారినపడకుండా కరాటే లాంటి ఆటలను అలవరుచుకోవాలని సూచించారు. ముఖ్యంగా బాలికలు కరాటే నేర్చుకోవాలని సలహా ఇచ్చారు.