Pawan Kalyan’s rare appearance with sons Akira Nandan and Mark Shankar Goes Viral | ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన కుమారులతో కలిసి ఉన్న ఫోటో ఒకటి వైరల్ గా మారింది.
పెద్ద కుమారుడు అకీరా నందన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ తో కలిసి పవన్ కళ్యాణ్ శుక్రవారం మంగళగిరి చేరుకున్నారు. మంగళగిరి చేరుకున్న అనంతరం ఆయన కుమారులతో కలిసి నడుస్తున్న ఫోటోను జనసేన పార్టీ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.
దీనిని ఆయన ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మంగళగిరి నివాసానికి చేరుకున్న పవన్ అధికారులు, పార్టీ ప్రతినిధులతో ముఖ్యమైన విషయాలపై చర్చించారు.
అనంతరం మార్కాపురం నియోజకవర్గంలో జల్ జీవన్ మిషన్ కింద రూ.1,290 కోట్లతో చేపట్టనున్న తాగునీటి పథకానికి శంకుస్థాపన చేసేందుకు బయలుదేరారు.









