Thursday 21st November 2024
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > తిరుపతి ప్రజలకు శ్రీవారి దర్శన నిర్ణయంపై పవన్ కళ్యాణ్ హర్షం

తిరుపతి ప్రజలకు శ్రీవారి దర్శన నిర్ణయంపై పవన్ కళ్యాణ్ హర్షం

Pawan Kalyan On TTD | తిరుపతి ప్రజలకు ప్రతి నెల మొదటి మంగళవారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం కల్పిస్తూ టిటిడి ( TTD ) పాలక మండలి సమావేశంలో నిర్ణయం తీసుకోవడం హర్షణీయమన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.

ఈ నిర్ణయం తిరుపతి ప్రజలకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని చెప్పారు. ఎన్నికల ప్రచార సమయంలో ఆ నగర ప్రజలు ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకువచ్చారని పేర్కొన్నారు. ఆ సందర్భంలో కూటమి ప్రభుత్వం తప్పకుండా తిరుపతి ప్రజలకు నెలలో ఒక రోజు శ్రీవారి దర్శనం కల్పిస్తుందని తాను హామీ ఇచ్చినట్లు గుర్తుచేశారు.

నగర ప్రజల ఆకాంక్షను టిటిడి చైర్మన్, ఈవో దృష్టికి తీసుకువెళ్లి పరిశీలించాలని సూచించినట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. టిటిడి పాలక మండలి తొలి సమావేశంలోనే ఈ విషయంపై నిర్ణయం తీసుకున్నందుకు చైర్మన్ బి. ఆర్. నాయుడుకి, పాలక మండలి సభ్యులకు, ఈవో శ్యామలరావుకి అభినందనలు చెప్పారు.

తిరుమల పవిత్రతను పరిరక్షించేందుకు ఆలోచనలు చేస్తూ, ఆ దిశగా సంబంధిత అధికార యంత్రాంగాన్ని నడిపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకి కృతజ్ఞతలు చెప్పారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.

You may also like
ఝార్ఖండ్ ఎవరి సొంతం !
మహారాష్ట్రలో అధికారాన్ని కైవసం చేసుకోబోయేది ఎవరంటే !
సూర్యకుమార్ ను వెనక్కునేట్టేసిన తిలక్ వర్మ
నరేందర్ రెడ్డిని ఉగ్రవాదిలా ఎందుకు అరెస్ట్ చేశారు : హై కోర్టు

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions