Telangana janasena News| తెలంగాణ ( Telangana ) ఎన్నికల వేళ ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ లో జరిగిన ఎన్నికల్లో ఆంధ్రా మూలాలు ఉన్న పార్టీలు పోటీకి దిగుతూ వస్తున్నాయి.
2014 లో టీడీపీ ( Tdp ), బీజేపీ ( BJP ) తో పొత్తు పెట్టుకొని పోటీ చేయగా వైసీపీ ( Ycp ) కూడా పోటీలో నిలిచింది. 2014 ఎన్నికల్లో టీడీపీ 15 సీట్లు, మల్కాజిగిరి ఎంపీ గెలవగా, బీజేపీ 5 సీట్లలో గెలుపొందింది.
మరోవైపు వైసీపీ కూడా ఉమ్మడి ఖమ్మం ( Khammam ) జిల్లాలో 3 ఎమ్మెల్యే సీట్లలో, ఖమ్మం పార్లమెంట్ లో విజయం సాధించింది. ఆ తర్వాత జరిగిన 2018 ఎన్నికల్లో వైసీపీ పోటీకి దూరంగా ఉండగా టీడీపీ మాత్రం కాంగ్రెస్ ( Congress ) తో పొత్తు పెట్టుకొని రెండు చోట్ల విజయం సాధించింది.
కానీ ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో మాత్రం ఆంధ్రా మూలాల ఉన్న పార్టీల్లో ఒక్క జనసేన ( Janasena ) మినహా, ఇతర పార్టీలు పోటీకి దూరంగా ఉంటున్నాయి. తొలుత పోటీ చేస్తామన్న టీడీపీ ఆఖరి నిమిషంలో పోటీ నుండి తప్పుకుంది టీడీపీ.
ఆంధ్రా లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు టీడీపీ నాయకులు. గతం లో లాగానే తెలంగాణ రాజకీయాల పట్ల ఆనాసక్తి కనబరిచింది వైసీపీ.
వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ, సీఎం జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల ( Ys Sharmila ) కూడా కాంగ్రెస్ విలీన ప్రక్రియ ఆలస్యం అవ్వడంతో అన్ని స్థానాల్లో పోటీ చేస్తానని ప్రకటించి అనూహ్యంగా పోటీ నుండి తప్పుకున్నారు. అంతే కాకుండా బేషరతుగా కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించారామే.
కానీ జనసేన మాత్రం బీజేపీ తో పొత్తు లో భాగంగా 8 చోట్ల బరిలో నిలిచింది. మొదట ఒంటరిగానే 32 చోట్ల పోటీ చేస్తామని ప్రకటించింది జనసేన పార్టీ. అయితే రంగంలోకి దిగిన బీజేపీ నాయకులు జనసేనని పవన్ కళ్యాణ్ ( Pawan kalyan ) తో చర్చలు జరిపి పొత్తుగా ముందుకు వెళ్లాలని నిర్ణయించారు.
ఈ నేపథ్యంలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ ఒక్కటే తెలంగాణ బరిలో నిల్వనుంది