Pawan Kalyan Impact On Maharastra Elections | ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి 100 శాతం స్ట్రైక్ రేట్ ( Strike Rate ) ను సాధించినట్లు జనసేన పార్టీ ప్రకటించింది.
మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులకు మద్దతుగా జనసేనాని ప్రచారంలో పాల్గొన్న విషయం తెల్సిందే. శనివారం వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహించిన అన్ని అసెంబ్లీ స్థానాల్లో మహాయుతి అభ్యర్థులు ఘన విజయాన్ని నమోదు చేశారు.
ఈ క్రమంలో పవన్ కల్యాణ్ ప్రచారం చేసిన నియోజకవర్గాలు అన్నిటా విజయం దక్కడంతో మరోసారి 100 శాతం రిజల్ట్ మార్క్ అందుకున్నారని జనసేన పోస్ట్ చేసింది. డేగ్లూర్, భోకర్, లాతూర్, షోలాపూర్ నగరంలోని మూడు స్థానాలు, బల్లార్ పూర్, చంద్రాపూర్, పుణె కంటోన్మెంట్, హడ్సర్ పూర్, కస్బాపేట్ నియోజకవర్గాలలోని మహాయుతి అభ్యర్థులను గెలిపించాలని పవన్ కల్యాణ్ సభల్లో పాల్గొన్నారు.
ప్రచారంలో పాల్గొన్న అన్ని స్థానాల్లో మహాయుతి అభ్యర్థులే విజయం సాధించడం విశేషం. అంతేకాకుండాలాతూర్ సిటీ, డేగ్లూర్ అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ తొలిసారి విజయం అందుకోవడం గమనార్హం.