Friday 30th January 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > రూ. 10 కోట్లు విరాళంఇచ్చిన పవన్ కళ్యాణ్!

రూ. 10 కోట్లు విరాళంఇచ్చిన పవన్ కళ్యాణ్!

pawan kalyan

Pawan Kalyan Donation | సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్ర ప్రదేశ్ లో టీడీపీ జనసేన కూటమి (TDP Janasena Alliance) విజయం సాధించాలని ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఓ వైపు టీడీపీలో బాబు సభల్లో పాల్గొంటున్నారు.

మరోవైపు జనసేన అధినేత పవన్ పార్టీ నేతలతో సమావేశం అవుతూ ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నారు. అందులో భాగంగా, సోమవారం ఉమ్మడి విశాఖ జిల్లా నేతలతో సమావేశమై పార్టీ నేతలకు కీలక సూచనలు చేశారు.

టీడీపీ-జనసేన కూటమి తప్పకుండా అధికారంలోకి వస్తుందన్నారు. పార్టీ కోసం కష్టపడిన వారికి తప్పుకుండా సరైన ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు స్పష్టమైన తీర్పు ఇవ్వబోతున్నారని పవన్ పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని క్షేత్రస్థాయిలో పార్టీ బలాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో టీడీపీ జనసేన కూటమిని గెలుపు కోసం ప్రతి కార్యకర్త ముందుకెళ్లాలని ఆదేశించారు.

2019 తర్వాత జనసేన కోసం పని చేసిన వారికి తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఏపీ అభివృద్ధికి సుస్థిర పాలన అవసరమని, అందుకోసం అందరూ కృషి చేయాలన్నారు.

అనంతరం పార్టీ బలోపేతానికి, పార్టీ పక్షాన ఎన్నికల నిర్వహణ కోసం రూ. 10 కోట్లు తన స్వార్జితాన్ని నిధిగా ఇవ్వనున్నట్లు పవన్ ఈ సమావేశంలో ప్రకటించారు.

You may also like
జూదం, పందెం భోగి మంటల్లో కలాలి..సంప్రదాయం వెలగాలి
pawan kalyan
కొండగట్టులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. అభివృద్ధి పనులకు శంకుస్థాపన!
pawan kalyan and ntr
ఢిల్లీ హైకోర్టుకు పవన్ కళ్యాణ్.. ఎన్టీఆర్.. కారణం ఏంటంటే!
mega family watches og
ఓజీ సినిమాపై మెగాస్టార్ రివ్యూ.. చిరంజీవి ఏమన్నారంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions