Tuesday 6th May 2025
12:07:03 PM
Home > తాజా > ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని కుట్ర చేస్తున్నారు

ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని కుట్ర చేస్తున్నారు

Patel Ramesh Reddy Latest News | లగచర్ల ఘటనలో ఎవరు ఉన్నా చర్యలు తప్పవని టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ మేరకు శుక్రవారం గాంధీ భవన్ ( Gandhi Bhavan ) లో మీడియాతో మాట్లాడారు.

ఇటీవల పరిణామాలు చూసిన ప్రజలు ప్రతిపక్షం ఇంకా ఇంత దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉంది అనుకుంటున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని,రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని అస్తిరపరచాలని కుట్ర చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

దేశంలో ఎక్కడ లేనివిధంగా రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వం కు మాత్రమే దక్కుతుందన్నారు. జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్ ఇవ్వాలని ప్రభుత్వం కుల గణన చేపడుతుందని తెలిపారు. పారిశ్రామికంగా అభివృధి.. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని సీఎం ఆలోచిస్తున్నట్లు చెప్పారు.

కేటీఆర్ ( KTR ),పట్నం నరేందర్ రెడ్డి ( Patnam Narender Reddy ) రైతులను రెచ్చగొట్టి దాడులు చేయించారని ఆరోపించారు. అధికారులను చంపే ప్రయత్నం చేయించారని కన్నెర్ర చేశారు. మల్లన్న సాగర్ భూ నిర్వాసితులకు సరైన నష్టపరిహారం ఇవ్వలేదు,కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నపుడు ఇటువంటి దాడులు చేస్తే.. ప్రాజెక్టులు కట్టేవారా..? అని నిలదీశారు.

రైతులకు బేడీలు వేసింది వాస్తవం కాదా..?అధికారం పోయాక.. కేటీఆర్ కి మతిబ్రమించిందని ధ్వజమెత్తారు. కేటీఆర్ కి ఇంకా అధికార దాహం.. పిచ్చి పోలేదని మండిపడ్డారు. కేటీఆర్, పట్నం నరేందర్ రెడ్డి కి డైరెక్షన్ ( Direction ) ఇచ్చాడని హాట్ కామెంట్స్ చేశారు.

సురేష్ కి అసలు భూమి లేనే లేదని పేర్కొన్నారు.కేటీఆర్ కి సిగ్గుందా..?, ఇచ్చిన ఒక్క హామీ అయిన నెరవేర్చారా..? కేటీఆర్ జైలుకు వెళ్లాల్సి వస్తుందని భయపడి ప్రభుత్వాన్ని అస్తిరపరచలని చూస్తున్నారని సీరియస్ ( Serious ) అయ్యారు.

లగచర్ల ఘటనలో కేసిఆర్,కేటీఆర్ ఎవ్వరూ ఉన్న చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. గతంలో కేటీఆర్ ఫాం హౌస్ లో డ్రగ్స్ తీసుకొని సినిమా వాళ్ళతో ఎంజాయ్ ( Enjoy ) చేశారని పటేల్ రమేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు

You may also like
‘సమాచారం ఉన్నా ఉగ్రదాడిని ఎందుకు అడ్డుకోలేదు’
‘నీట్ పరీక్ష రాసిన 72 ఏళ్ల బామ్మ, తల్లీకూతురు’
‘పవన్ ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్..ఆ సినిమా షూటింగ్ పూర్తి’
‘Miss World విజయవంతంగా సాగాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions