Friday 22nd November 2024
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > పార్లమెంట్ లో ఆగంతకుల కలకలం.. బీజేపీ ఎంపీ పాస్ తో ప్రవేశం!

పార్లమెంట్ లో ఆగంతకుల కలకలం.. బీజేపీ ఎంపీ పాస్ తో ప్రవేశం!

Loksabha breach

Intruders In Parliament | పార్లమెంట్‌ శీతకాల సమావేశాల్లో ఆగంతకుల ప్రవేశం కలకలం రేపింది. లోక్‌సభ విజిటర్స్ గ్యాలరీలో కూర్చున్న ఇద్దరు వ్యక్తులు ఒక్కసారిగా సభ చాంబర్‌లోకి దూకారు. అనంతరం సభలో టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. ఈ ఆకస్మిక ఘటనతో సభలోని ఎంపీలంతా భయంతో బయటకు పరుగులు తీశారు.

వెంటనే స్పీకర్ లోక్ సభను వాయిదా వేశారు. ఆగంతకులను భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. నిందితులను నీలం అనే మహిళ, అమోల్ షిండేగా గుర్తించారు. టియర్ గ్యాస్ బాటిల్‌ను షూలో దాచిపెట్టి లోపలికి ప్రవేశించినట్లు భద్రతా సిబ్బంది గుర్తించారు.

రాజ్యాంగాన్ని కాపాడాలి.. నియంతృత్వం చెల్లందంటూ షూ నుంచి టియర్ గ్యాస్ తీసి విసిరారు.  2001 లో పార్లమెంట్‌పై ఉగ్రదాడి జరిగిన డిసెంబర్ 13నే ఈ ఘటన జరగడం గమనార్హం. ఆరోజు పాక్ ఉగ్రవాదులు పార్లమెంట్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో 9 మంది అమరులయ్యారు.

ఈ నేపథ్యంలో బుధవారం ఉగ్రదాడిలో అమరులైన వారి కోసం సంస్మరణ సభను పార్లమెంట్‌ ప్రాంగణంలో ఏర్పాటు చేయగా.. ఉప-రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌, ప్రధాని నరేంద్ర మోదీ, స్పీకర్‌, కేంద్రమంత్రులు సహా పత్రిపక్ష నేతలు నివాళులర్పించారు.

ఈ కార్యక్రమం ముగిసిన కొద్ది సేపటికే ఆగంతకులు విజిటర్స్ గ్యాలరీ నుంచి చాంబర్‌లోకి దూకారు. జీరో అవర్ జరుగుతుండగా.. ఉత్తర మాల్దా బీజేపీ ఎంపీ ఖాగేన్ ముర్ము మాట్లాడుతున్నారు.

ఈ సమయంలో ఘటన చోటుచేసుకుంది. నిందితులు మైసూర్ ఎంపీ ప్రతాప్ పాస్‌లతో పార్లమెంట్‌లోకి ప్రవేశించినట్టు తెలుస్తోంది. ‘తానా షాహీ బంద్ కరో.. భారత్ మాతాకీ జై’ అనే నినాదాలు చేశారు.

You may also like
జగన్ కు అదానీ లంచం..వైసీపీ కీలక వ్యాఖ్యలు
నాగచైతన్య-శోభిత పెళ్లిపై నాగార్జున ఏమన్నారంటే !
నన్ను కాపాడండి..ప్రాణాలు పోతున్నాయన్నా చలించని మనుషులు
అఖండ భారతంలో అదానీకో న్యాయం ఆడబిడ్డకో న్యాయమా

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions