Pakistan Name On Team India Jersey | ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ( ICC Champions Trophy ) 2025 కు సర్వం సిద్ధమయ్యింది. ఇప్పటికే రోహిత్ బృందం దుబాయ్ చేరుకుని ప్రాక్టీస్ మొదలెట్టింది.
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఫిబ్రవరి 20 న టీం ఇండియా బంగ్లాదేశ్ తో తలపడనుంది. ఈ క్రమంలో ప్లేయర్లు నూతన జెర్సీను ధరించి ఫోటో షూట్ ( Photoshoot ) లో పాల్గొన్నారు.
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం సిద్ధం చేసిన జెర్సీను ధరించిన కెప్టెన్ రోహిత్ శర్మ ( Rohit Sharma ), విరాట్ కోహ్లీ, శుభమన్ గిల్, రిషబ్ పంత్ మరియు మహమ్మద్ షమీ ఫోటోలకు ఫోజులిచ్చారు. అయితే నూతన జెర్సీపై పాకిస్తాన్ పేరు ఉండడం ఆసక్తిగా మారింది.
ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెల్సిందే. కానీ ఇండియా మాత్రం తన మ్యాచులను దుబాయ్ వేదికగా ఆడనుంది. ఈ క్రమంలో టీం ఇండియా జెర్సీ పై నుండి పాకిస్తాన్ పేరును తొలగించాలని పలువురు అభిమానుకు బీసీసీఐని కోరిన విషయం తెల్సిందే.
ఈ నేపథ్యంలో తాజగా బీసీసీఐ ( BCCI ) స్పందించింది. తాము ఐసీసీ నిబంధనలకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేసింది. ఐసీసీ టోర్నీకి ఏ దేశం ఆతిధ్యం ఇచ్చినా జెర్సీపై ఆ దేశ పేరు ఉంటుంది. ఇందులో భాగంగానే టీం ఇండియా జెర్సీపై పాకిస్తాన్ పేరును ముద్రించినట్లు బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది.