Pakistan Knocked Out Of Champions Trophy 2025 | ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆతిథ్య పాకిస్థాన్ జట్టు ఒక్క మ్యాచ్ కూడా గెలవకముందే ఇంటిముఖం పట్టింది.
29 ఏళ్ల తర్వాత ఐసీసీ ఈవెంట్ కు పాక్ వేదికవ్వడం మరియు డిఫెండింగ్ ఛాంపియన్స్ గా ఆ టీం భారీ అంచనాల నడుమ ఛాంపియన్స్ ట్రోఫీ బరిలోకి దిగింది. అయితే అభిమానుల ఆశలపై ప్లేయర్లు నీళ్లు చల్లారు.
ఒక్కటంటే ఒక్క మ్యాచ్ లో కూడా గెలవకుండానే పాక్ ఛాంపియన్స్ ట్రోఫీ లో లీగ్ దశలోనే నిష్క్రమించింది. తొలి రెండు మ్యాచుల్లో న్యూజీలాండ్, భారత్ చేతిలో ఓడిన పాక్ బంగ్లాదేశ్ పై అయినా గెలిచి పరువు నిలుపుకోవాలని చూసింది.
అయితే గురువారం జరగాల్సిన పాకిస్థాన్-బంగ్లాదేశ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. మ్యాచ్ జరగాల్సిన రావల్పిండి లో గురువారం ఉదయం నుండి భారీ వర్షం కురుస్తోంది. దింతో స్టేడియం మొత్తం చిత్తడిగా మారింది. దింతో టాస్ కూడా వెయ్యకుండానే ఎంపైర్లు మ్యాచును రద్దు చేశారు.
ఈ క్రమంలో జట్లకు చెరో పాయింట్ ఇచ్చారు. మరోవైపు ఇండియా, న్యూజీలాండ్ సెమీస్ కు అర్హతను సాధించిన విషయం తెల్సిందే. బంగ్లాదేశ్ సైతం ఒక్క మ్యాచ్ కూడా గెలవకముందే టోర్నీ నుండి నిష్క్రమించింది.









