Wednesday 18th February 2026
12:07:03 PM
Home > తాజా > ‘బుద్ధుడు, అంబేద్క‌ర్ మార్గంలో మా పాల‌న కొన‌సాగుతుంది’

‘బుద్ధుడు, అంబేద్క‌ర్ మార్గంలో మా పాల‌న కొన‌సాగుతుంది’

bhatti vikramarka
  • వారి ఆలోచ‌న‌లే స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం
  • ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌

Deputy CM Bhatti Vikramarka | గౌత‌మ బుద్ధుడు, బాబాసాహెబ్ అంబేద్క‌ర్ దార్శ‌నిక మార్గంలో మా ప్ర‌జాప్ర‌భుత్వం ప‌రిపాల‌న కొన‌సాగుతుంద‌ని ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క స్ప‌ష్టంగా పేర్కొన్నారు. బుద్ధుడు, అంబేద్క‌ర్ లు ఆలోచ‌న‌ల విధాన‌మే స‌క‌ల స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కార మార్గ‌మ‌ని అయ‌న చెప్పారు.

నెక్లెస్ రోడ్ స‌ర్కిల్ వ‌ద్ద‌నున్న అబేద్క‌ర్ స్మృతివ‌నం వ‌ద్ద విశ్వ‌శాంతిని కాంక్షిస్తూ పాద‌యాత్ర చేస్తున్న థాయిలాండ్, భార‌తీయ‌ బౌద్ధ స‌న్యాసుల‌తో జ‌రిగిన స‌మావేశంలో ఉప ముఖ్య‌మంత్రి పాల్గొని మాట్లాడారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌తో పాటుగా కార్మిక శాఖ‌మంత్రి వివేక్ వెంక‌ట స్వామి, బుద్ధ‌వ‌నం ప్రాజెక్ట్ ఓఎస్డీ మ‌ల్లేప‌ల్లి ల‌క్ష్మ‌య్య, కాకి మాధ‌వ‌రావ్ ఐఏఎస్ (మాజీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి) త‌దిత‌రులు పాల్లొన్నారు.

ఈ సంద‌ర్భంగా ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క మాట్లాడుతూ.. బుద్ధ‌వ‌నం గురించి రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకుంటోంది. అందులో భాగంగా నిధులు కేటాయించ‌డ‌మే కాకుండా ఓఎస్డీ మ‌ల్లేప‌ల్లి ల‌క్ష్మ‌య్యను నియ‌మించి అన్ని కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌భుత్వం నిర్వ‌హిస్తోంద‌న్నారు.

నాగార్జున సాగ‌ర్ వ‌ద్ద‌నున్న బుద్ధ‌వ‌నం చాలా అద్భుతంగా ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం బుద్ధవనం ప్రాజెక్టును ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. . అక్క‌డ‌కు వెళితే మాన‌సిక ప్ర‌శాంతత ఏర్ప‌డుంది. బౌద్ధులకు అవ‌స‌ర‌మైన అన్ని ఏర్పాట్ల‌ను ప్ర‌జా ప్ర‌భుత్వం ఏర్పాటు చేసింద‌ని అన్నారు.

​బుద్ధవనం ఒక అద్భుతమైన పర్యాటక మరియు ఆధ్యాత్మిక కేంద్రమ‌ని ఆయ‌న చెప్పారు. ఇక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. బౌద్ధ భిక్షువులకు, పర్యాటకులకు అవసరమైన అన్ని సౌకర్యాలను మేము ఇక్కడ ఏర్పాటు చేశామ‌ని చెప్పారు.

నెక్లెస్ రోడ్ లోని బాబా సాహెబ్ అంబేద్క‌ర్ సెంట‌ర్ లో మ‌న‌మంతా స‌మావేశం కావ‌డం మంచి విష‌య‌మ‌ని అన్నారు. ఈ కేంద్రంలో బాబా సాహెబ్ అబేద్క‌ర్ జీవిత చ‌రిత్ర‌ను, వారి సందేశాల‌ను, వారి చూపించిన మార్గాన్ని రేప‌టి త‌రాల‌కు తరానికి తెలియజేసేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు చెప్పారు.

అంబేద్కర్ గారు మన దేశానికి అందించిన రాజ్యాంగం, సామాజిక న్యాయం పట్ల వారికి ఉన్న నిబద్ధతను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు.

థాయిలాండ్ నుంచి 70 మంది, మ‌రో 30 మంది భార‌తీయ బౌద్ధ బిక్షువులు ఫిబ్ర‌వ‌రి 2న‌ క‌ర్నాట‌క‌లోని క‌ల‌బురిగి నుంచి పాద‌యాత్ర‌ను మొద‌లు పెట్టారు. మార్చి 1 నాటికి నాగార్జున సాగ‌ర్ లోని బుద్ధ‌వ‌నం వ‌ర‌కూ వారి పాద‌యాత్ర కొన‌సాగునుంది.

You may also like
cm revanth
కార్బన్ ఫ్రీ నగరంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దుతాం: సీఎం రేవంత్
tgsrtc green metro
ప్రయాణీకులకు ఆర్టీసీ శుభవార్త!
bio asia summit 2026
ప్రపంచ వ్యాక్సిన్ రాజధానిగా హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి
errabelli dayakar rao gets emotional
“45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితి చూడలేదు”

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions